వంటగ్యాస్ ధరలు తగ్గాయి

వంటగ్యాస్ ధరలు తగ్గాయి

వంట గ్యాస్ వినియోగదారులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ శుభవార్త తెలిపింది. సబ్సిడీలేని గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్‌ ధరను రూ.100.50 తగ్గిస్తున్నట్లు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(IOC) తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్‌ ధరలు తగ్గడం, డాలర్‌తో రూపాయి మారకం బలపడడంతో గ్యాస్ ధరను తగ్గిస్తున్నట్లు తెలిపింది. సబ్సిడీలేని ఎల్పీజీ ధర ప్రస్తుతం రూ.737.50గా ఉండగా… అది ఇవాళ్టి నుంచి రూ.637కు లభించనుంది. ఇక సబ్సిడీ ఎల్పీజీ ధర రూ.494.35 కాగా.. వినియోగదారులు ఒకసారి ఎల్పీజీ కొనుగోలు చేసిన తర్వాత సబ్సిడీగా చెల్లించే రూ.142.65 ఆయా వినియోగదారుల బ్యాంకు ఖాతాలో జమకానున్నాయి. తగ్గిన గ్యాస్ ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నాయి.