పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర.. హైదరాబాద్లో రూ.2 వేలు

 పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర.. హైదరాబాద్లో రూ.2 వేలు

కమర్షియల్ సిలిండర్ గ్యాస్ ధరను ఆయిల్ కంపెనీలు మరోసారి పెంచాయి.  19 కేజీల సిలిండర్ పై రూ.25.50 మేర పెంచాయి.  దీంతో ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.  1795గా ఉంది. కోల్‌కతాలో రూ. 1,911,  ముంబైలో రూ. 1,749, చెన్నైలో రూ. 1,960గా ఉంది.  ఇక ఏపీలో  కూడా ఇదే ధర పెరగగా రూ.  1959గా ఉంది.  

 హైదరాబాద్ లో మాత్రం రూ.  17 పెరిగి రూ.  2002కు చేరుకుంది.   మరోవైపు  గృహ అవసరాలకు  వినియోగించే గ్యాస్ ధరలో ఎలాంటి పెంపు లేదు.  ప్రభుత్వరంగ సంస్థలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరను పెంచడం వరుసగా ఇది రెండోసారి. ఫిబ్రవరి 1న 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలు రూ.14 పెరిగాయి.  

అయితే, నూతన సంవత్సరం 2024 సందర్భంగా, 19 కిలోల వాణిజ్య వంట గ్యాస్ ధరలను సిలిండర్‌కు  రూ.  39.50 తగ్గించారు.  నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తుంటారు.