హైదరాబాద్ బల్దియా శానిటేషన్ పై లక్నో మేయర్ టీమ్ స్టడీ

హైదరాబాద్ బల్దియా శానిటేషన్ పై లక్నో మేయర్ టీమ్ స్టడీ

హైదరాబాద్, వెలుగు: లక్నో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్  శానిటేషన్ బెస్ట్ ప్రాక్టీసెస్ పై స్టడీకి హైదరాబాద్ కు వచ్చారు. వారు జవహర్ నగర్ లో డంపింగ్ యార్డు, శానిటేషన్ ను పరిశీలించారు. సోమవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని మర్యాద పూర్వకంగా కలిసి శానిటేషన్, సీఅండ్ డీ సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ను బల్దియాలో అమలు చేసే వివరాలను మేయర్ ను వారు అడిగి తెలుసుకున్నారు. లక్నో మేయర్ సుష్మ ఖరక్వాల్, కార్పొరేటర్లు బృందం సభ్యులు ఉన్నారు.