
సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7 వ తేది ఆదివారం ఏర్పడనుంది. చంద్రగ్రహణ సమయంలో ... చంద్రుడు భూమి నీడలో పూర్తిగా ఉంటాడు. ఈ చంద్రగ్రహణం కొన్ని నగరాల్లో సంపూర్ణంగా కనిపించనుంది. మరి హైదరాబాద్ లో కనిపిస్తుందా.. ఎక్కడెక్కడ కనిపిస్తుంది. గ్రహణాన్ని ఎలా చూడాలి... మొదలగు విషయాలనుఈ స్టోరీలో తెలుసుకుందాం. .
ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 7న ఏర్పడే చంద్రగ్రహణం భారతదేశం అంతటా కనిపిస్తుంది. మరి హైదరాబాద్ లో చాలా స్పష్టంగా కనపడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. చంద్రగ్రహణ సమయంలో ... చంద్రుడు భూమి నీడలో పూర్తిగా ఉంటాడు. అయితే వాతావరణం సరిగ్గా ఉంటే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశంలో హైదరాబారాబాద్ సహా 15 నగరాల్లో క్లారిటీగా చూడొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
- దక్షిణ భారతదేశం: చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి
- ఉత్తర భారతదేశం: ఢిల్లీ, చండీగఢ్, జైపూర్, లక్నో
- పశ్చిమ భారతదేశం: ముంబై, అహ్మదాబాద్, పూణే
- తూర్పు భారతదేశం: కోల్‌కతా, భువనేశ్వర్, గౌహతి
- మధ్య భారతదేశం: భోపాల్, నాగ్‌పూర్, రాయ్‌పూర్
చంద్రుడికి పూర్తిగా అడ్డు వస్తే.. సంపూర్ణ చంద్రగ్రహణం.. కొద్దిగా అడ్డుగా ఉంటే పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఆదివారం ( సెప్టెంబర్7) సంపూర్ణ చంద్రగ్రహణం కావున చంద్రుడు ఎరుపు రంగులో మెరుస్తూ ఆకాశంలో కనువిందు చేయనున్నాడు. తరువాత క్రమంగా మళ్ళీ ప్రకాశిస్తుంది. తరువాత రేలీ స్కాటరింగ్ కారణంగా చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు . బ్లడ్ మూన్ సూర్యుని కాంతి .. భూమిపై పడినప్పుడు .. ఆ సమయంలో చంద్రుడికి.. సూర్యుడికి మధ్యలో భూమి వచ్చినప్పుడు చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడు. అయితే సూర్యుడు.. చంద్రుడు.. భూమి కదలికలను బట్టి ఒక్కో సమయంలో ఒక్కో ప్రాంతంలో సంపూర్ణ చంద్రగ్రహణం కనువిందుచేస్తుంది.
చంద్రగ్రహణాన్ని ఎలా చూడాలి..
చంద్రగ్రహణాన్ని నేరుగా చూడవచ్చు. ఎలాంటి కళ్లజోడు.. రక్షణ పరికరాలు అవసరం లేదు.
బైనాక్యులర్లు లేదా టెలిస్కోప్ లో చూసినట్లైతే... చంద్రుని ఉపరితలంపై ఉండే వాటిని స్పష్టంగా చూడవచ్చు. క్రేటర్లు చంద్రుడిపై ఎలా ఉంటాయో టెలిస్కోప్ లను ఉపయోగించి చూడవచ్చు.
స్టెల్లారియం .. స్కైసఫారి వంటి యాప్‌లు దానిని గుర్తించడంలో సహాయపడతాయి.
►ALSO READ | చంద్ర గ్రహణం 2025 : గ్రహణ ప్రభావం తీవ్రంగా ఉండే సమయం, పట్టు విడుపుల టైం కచ్చితంగా తెలుసుకోండి..