కరోనా నుంచి కోలుకున్నా లంగ్స్ కు దెబ్బే

కరోనా నుంచి కోలుకున్నా లంగ్స్ కు దెబ్బే
  • కణాలు దెబ్బతిని ఫైబ్రోసిస్ గడ్డలు
  •  నాళాల్లో గడ్డకడుతున్న రక్తం..20 నుంచి30 శాతం మందిలో సమస్య
  • డిశ్చార్జి టైంలో స్కానింగ్ చేయించుకోవాలంటున్న డాక్టర్లు

హైదరాబాద్, వెలుగు: కరోనా సోకి కోలుకున్నా కూడా చాలా మందిలో వైరస్ చేస్తున్న గాయాలు మానడం లేదు. బయటికి అంతా మామూలుగా అయినట్టు కనిపిస్తున్నా లోపల లంగ్స్ దెబ్బతింటున్నాయి. కణాలు గట్టిపడి ఫైబ్రోసిస్ గడ్డలు ఏర్పడుతున్నాయి. నాళాల్లోరక్తం గడ్డ కట్టి ఆ మేర లంగ్స్ పాడైపోతున్నాయి. వైరస్ నుంచి కోలుకు న్న 20 నుంచి 30 శాతం మంది ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డ కట్టిన ఆనవాళ్లు కనపడుతున్నాయని డాక్టర్లు  చెప్తున్నారు. కొందరిలో ఒకట్రెండు నెలల్లోనే ఈ సమస్య బయటపడుతోందని.. లంగ్స్ ఇన్ఫెక్షన్‌ మొదలై మళ్లీ హాస్పిటళ్లకు  వస్తున్నారని అంటున్నారు. చాలా మందిలో ఈ ఎఫెక్ట్ ఇప్పుడే తెలియకపోయినా.. భవిష్యత్‌లో సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కరోనా టైంలో దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు సివి యర్‌గా ఉన్నవాళ్లతో పాటు.. మైల్డ్‌‌, మోడరేట్ సింప్టమ్స్‌‌తో బయటపడిన వాళ్లలోనూ  ఈ తరహా బ్లడ్‌ క్లాట్స్ ఉంటున్నాయని డాక్లర్లు చెప్తున్నారు. బీపీ, షుగర్‌, కిడ్నీ, గుండె వంటి దీర్ఘ కాలిక జబ్బులున్న పేషెంట్లు, స్మోకింగ్ అలవాటున్న వాళ్లు, ఇదివరకే ఊపిరితిత్తుల సమస్య ఉన్నవాళ్లు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

ఎందుకిట్లా ?

కరోనా వైరస్ శరీరంలోకి ఎంటరైన తర్వాత తొలుత లంగ్స్‌‌ పైనే దాడి చేస్తోంది. ముఖ్యంగా లంగ్స్‌‌లో రక్తనాళాలకు అనుసంధానంగా ఉండే ఎండోథెలియల్ కణాలపై ఎటాక్‌‌చేస్తున్నట్టు డాక్టర్లు గుర్తించారు. ఈ ఎటాక్‌‌ను ఎదుర్కొనేందుకు రక్తనాళాల వద్దకొన్ని ప్రోటీన్లు విడుదలవుతున్నాయి. ఇవే రక్త నాళాల్లో బ్లడ్‌ క్లాట్స్‌‌కు కారణం అవుతున్నాయి. కొందరిలో ఈ క్లాట్స్ నార్మల్‌‌గా, ఇంకొందరిలో పెద్దగా ఉంటున్నాయి. కొన్ని రో జుల తర్వాత వైరస్ తగ్గిపోయినా  క్లాట్స్ అలాగే ఉండిపోతున్నాయి. ఈ క్లాట్స్ పెద్దగా ఏర్పడిన వారికి రక్త ప్రసరణలో ఆటంకం ఏర్పడుతుందని.. ఆ భాగంలో లంగ్స్‌‌పాడైపోయి శ్వాస సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని డాక్టర్లు తేల్చారు. సీటీ స్కాన్‌ లేదా డీ డైమర్ టెస్టులు చేసినప్పుడు క్లాట్స్ విషయం బయటపడుతోంది. క్లాట్స్‌‌చిన్నగా ఏర్ప డిన వారికి వెంటనే ఇబ్బంది రాకపోయినా.. భవి ష్యత్‌లో సమస్యగా మారొచ్చు. అందువల్లే చాలా మంది కరోనా పేషెంట్లకు బ్లడ్ థిన్నర్స్‌‌(రక్తాన్ని పలుచగా చేసే మెడిసిన్‌) వాడాలని డాక్టరలు సూచిస్తున్నారు. ఒకవేళ ఎక్కడైన బ్ల డ్‌ క్లాట్స్‌‌ఉంటే ఆ మందులతో కరిగిపోతాయని చెప్తున్నారు.

టిష్యూపైనా ఎటాక్

వైరస్ ఎటాక్‌‌తో కొందరిలో లంగ్ టిష్యూస్‌‌ పాడవుతున్నాయి. సాఫ్ట్‌‌గా ఉండాల్సిన ఊపిరితిత్తులు గడ్డల్లా మారుతున్నాయి. దీన్ని లంగ్ ఫైబ్రోసిస్‌‌ అంటారు. ఆ గాయం ఎప్పటికీ మానిపోదని.. లంగ్స్‌‌లో కొద్దిగా దెబ్బతింటే పెద్ద సమస్యలేమీ రావని డాకర్్ట లుచెప్తున్నారు. అయితే మరోసారి ఏదైనా లంగ్ఇన్ఫెక్షన్ వస్తే చాలా ఇబ్బందులొచ్చే ప్రమాదం ఉంటుందని అపోలో హాస్పిటల్ డాక్టర్ శ్రీధర్‌ తెలిపారు. క్లాట్స్‌‌కు మెడిసిన్ ఉన్నా టిష్యూ డ్యామేజ్ను సరిచేయడానికి మందులు లేవన్నారు.

స్టేబుల్ పేషెంట్లలోనూ సమస్య వైరస్‌‌ ఎటాక్‌తో లంగ్స్ కణాలు దెబ్బతింటున్నాయి. సున్నితంగా ఉండాల్సిన లంగ్స్ గట్టిగా మారుతున్నాయి. మరోవైపు లంగ్స్ లోని రక్త నాళాల్లో క్లాట్స్‌‌ ఏర్పడుతున్నాయి. స్టేబుల్‌గా ఉన్నవాళ్లలోనూ ఈ బ్లడ్ క్లాట్ మార్కర్స్‌‌ కనిపిస్తున్నా యి. డిశ్చార్జి టైమ్‌‌లో బాగానే ఉంటున్నా తర్వాత మళ్లీ వస్తున్నారు. అందుకే డిశ్చార్జి టైమ్‌‌లో కొన్ని టెస్టులు చేయిస్తున్నాం. దాదాపు 30% మందికి క్లాట్‌‌ మార్క్స్‌ కనిపిస్తున్నాయి. సీటీ స్కాన్, డీ డైమర్ టెస్టులతో వీటిని గుర్తించొచ్చు. – డాక్టర్ శ్రీధర్‌‌‌‌, అపోలో హాస్పిటల్స్‌‌ క్రిటికల్ కేర్ విభాగం ఇచ్చారు.