సింపుల్ ఐడియాతో లగ్జరీ లుక్​

V6 Velugu Posted on Oct 21, 2021

గోడలు, ఫర్నిచర్, కర్టెన్లు అన్నీ మ్యాచింగ్​ కలర్స్​ ఉండొద్దు. మినిమమ్​ నాలుగు డిఫరెంట్​ కలర్స్​ ఉండాలి.  సూటబుల్​గా ఉండే మంచి రంగులను సెలక్ట్​ చేసుకోవాలి. ఇంట్లో కుర్చీలు, బల్లలు, బట్టలు, గిన్నెలు.. ఇలా చాలా వస్తువులు ఉంటాయి. ఎన్ని ఉన్నా ఎప్పటికప్పుడు మరిన్ని కొత్త వస్తువులు ఇంట్లోకి చేరుతుంటాయి. ఒక వస్తువును రెండు సంవత్సరాలకు పైగా వాడటం లేదంటే దానితో ఎలాంటి యూజ్​ లేదని అర్థం. అలాంటి వాటిని ఎప్పటికప్పుడు తీసేయాలి. లేదా ఎవరికీ కనిపించని రూమ్​లో పెట్టాలి. అదీ కాదంటే వాటిని వేరేవాళ్లు వాడుకోవడానికి ఇచ్చేయొచ్చు. సిటీల్లో అయితే వీటి కోసం ప్రత్యేకంగా స్టోర్​ రూమ్స్​ ఉంటాయి. ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంచాలి. వాటికంటూ స్పెషల్​గా ప్లేస్​ను కేటాయించాలి. ఇది ఇంటిని మరింత అట్రాక్టివ్​గా చేస్తుంది. పైగా  అవసరమైనప్పుడు వస్తువులను వెతికే శ్రమ తప్పుతుంది. ఇంటి గుమ్మాలకు, కిటికీలకు కర్టెన్లు స్పెషల్​లుక్​  ఇస్తాయి. వీటికి ఎక్కువ రేటు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కిటికీల కోసం కర్టెన్లు కొనేటప్పుడు పొడవైన కర్టెన్లను సెలక్ట్​ చేసుకోవాలి. వాటిని కిటికీ  ఎత్తుకన్నా పైనుంచి పెట్టుకోవచ్చు. ఇది ఇంటికి లగ్జరీ లుక్​ ఇస్తుంది. ఫ్లోర్ రగ్గులు  లగ్జరీ లుక్​ను పెంచుతాయి. మార్కెట్‌‌లో చాలా తక్కువ ధరలకే రగ్గులు దొరుకుతాయి. వాటిని సోఫా ముందు, లేదా డైనింగ్ టేబుల్ దగ్గర వాడొచ్చు. అలాగే డోర్​ మ్యాట్లు, కిచెన్​ మ్యాట్లు  వేసుకోవచ్చు. ఇంటి గోడలకు  సరైన రంగులు వేస్తే  క్లాసీ లుక్​ వచ్చేస్తుంది. దీంతోపాటు ఇంటిలోపల స్పేస్​ కూడా ఎక్కువ కనిపించేలా చేస్తాయి ఈ కలర్స్.  ఒక్కో రూమ్​ లో రెండు లేదా మూడు రంగుల కన్నా ఎక్కువ వాడొద్దు. ఆ రంగులు కూడా మంచి కాంబినేషన్లలో ఎంచుకోవాలి. ఎక్కువ రంగులు వాడితే చూడటానికి బాగా కనిపించకపోగా, ఇబ్బందిగా కూడా ఉంటుంది. అలాగే వాల్ స్టెన్సిల్స్ కూడా ట్రై చేయొచ్చు. ముఖ్యంగా లివింగ్​ రూమ్​లో, బెడ్​ రూమ్​లో వీటిని వేయొచ్చు. అయితే రూమ్​లో ఏదైనా ఒకవైపు​ మాత్రమే వాల్​ స్టెన్సిల్స్​ వాడితే బాగుంటుంది. మొక్కలు దాదాపు ఇంటి బయటే పెడతారు. కానీ వాటిని ఇంట్లో పెడితే ఇంటి అందమే మారిపోతుంది. అంతేకాదు ఇంట్లో మొక్కలు పెట్టడం వల్ల గాలి ఫిల్టర్ అవుతుంది కూడా. రూమ్​లో కుడివైపు మూలల్లో ఈ మొక్కలకు ప్లేస్​ ఇవ్వాలి. మామూలు మొక్కలు కాకుండా ఇండోర్​ ప్లాంట్స్​ పెట్టుకుంటే బాగుంటుంది. 

Tagged HOME, life style, IDEA, luxury,

Latest Videos

Subscribe Now

More News