మ్యూజిక్ లవర్స్‌‌‌‌ వదలనే అంటారు: ఎంఎం కీరవాణి

మ్యూజిక్ లవర్స్‌‌‌‌ వదలనే అంటారు: ఎంఎం కీరవాణి

కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీ ప్రియ జంటగా నటిస్తున్న చిత్రం ‘చెన్నై లవ్‌‌‌‌స్టోరీ’.  సాయి రాజేష్ కథను అందిస్తూ ఎస్‌‌‌‌కేఎన్‌‌‌‌తో కలిసి నిర్మిస్తున్నారు. రవి నంబూరి దర్శకుడు. తాజాగా ఈ  చిత్రం నుంచి ‘వదలనే’ అనే పాటను విడుదల చేశారు. మణిశర్మ కంపోజ్ చేయగా, అనంత శ్రీరామ్‌‌‌‌ లిరిక్స్ రాశారు. జావేద్ అలీ పాడాడు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌‌‌‌కు ఎంఎం కీరవాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఆయన మాట్లాడుతూ ‘పాట చూస్తుంటే ఇదొక ఫీల్ గుడ్ మూవీ అని అర్థమవుతోంది.  నా ఫ్రెండ్ మణిశర్మ ట్యూన్  చేసిన ఈ పాటను మ్యూజిక్ లవర్స్, మ్యూజిక్ ప్లాట్ ఫామ్స్ ‘వదలనే’ అనాలి. ఇలాంటి ప్రేమకథలకు సంగీతమే ప్రాణం’  అని అన్నారు.  సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్, మాధవపెద్ది సురేష్, కళ్యాణి మాలిక్, సురేష్ బొబ్బిలి, హరి గౌర, మార్క్ కె రాబిన్, స్వీకర్ అగస్తీ, శ్రీచరణ్ పాకాల, వివేక్ సాగర్, చేతన్ భరద్వాజ్,  సింజిత్ యెర్రమల్లి ఈ సినిమా పెద్ద మ్యూజికల్ బ్లాక్ బస్టర్ కావాలని కోరారు.

కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘సినిమా విజయంపై కాన్ఫిడెంట్‌‌‌‌గా ఉన్నాం. ‘వదలనే’  పాట పాండిచ్చేరిలో తీశాం. షూట్ అప్పుడే గౌరీ, నేను  చాలా ఎమోషనల్ అయ్యాం. సినిమాకు  ఈ సాంగ్ ప్లస్ అవుతుంది’ అని చెప్పాడు.  సింగర్ అవ్వాలనుకున్న తాను సంగీతానికి ప్రాధాన్యత ఇచ్చే చిత్రంలో నటించడం సంతోషంగా ఉందని గౌరీ ప్రియ చెప్పింది. 

‘వదలనే’ సాంగ్ అందరికీ కనెక్ట్ అవుతుందని దర్శకుడు రవి నంబూరి చెప్పాడు.  ప్రొడ్యూసర్ సాయి రాజేష్​ మాట్లాడుతూ ‘హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్‌‌‌‌లో వచ్చే పాట ఇది.  చిరకాలం మనసులో నిలిచిపోతుంది. మణిసార్ క్లాసిక్స్‌‌‌‌లో ఒక టాప్ సాంగ్‌‌‌‌లా నిలుస్తుంది’ అని చెప్పారు. ప్రొడ్యూసర్ ఎస్‌‌‌‌కేఎన్‌‌‌‌, కో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని సహా టీమ్ అంతా పాల్గొన్నారు.