కన్నడ స్టార్స్ శివ రాజ్‌కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి లీడ్ రోల్స్‌లో అర్జున్ జన్య తెరకెక్కిస్తున్న చిత్రం ‘45 ది మూవీ’. సూరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఉమా రమేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్, గ్లింప్స్ సినిమాపై హైప్‌ను పెంచాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
‘గెలుపు తలుపు దొరికే వరకు దిగులుపడుకురా’ అంటూ సాగే పాటకు రోల్ రైడా తెలుగు లిరిక్స్ అందించడంతోపాటు వినాయక్‌తో కలిసి పాడిన తీరు ఇంప్రెస్ చేసింది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలోని డ్యాన్స్ మూమెంట్స్, సాంగ్‌లోని విజువల్స్, ఆఫ్రికన్స్ చేసిన స్టెప్పులు ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి అర్జున్ జన్య దర్శకత్వం వహిస్తూ సంగీతాన్ని అందించాడు. డిసెంబర్ 25న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల కానుంది.
