నా భావాలకు, నా జ్ఞాపకాలకు అక్షర రూపమే "నాటు నాటు"

నా భావాలకు, నా  జ్ఞాపకాలకు అక్షర రూపమే "నాటు నాటు"

ఆస్కార్‌ అవార్డుల బరిలో RRR మూవీ నుంచి నాటు నాటు సాంగ్ నిలవడంపై  పాట రచయిత చంద్రబోస్ సంతోషం వ్యక్తం చేశారు. నాటు నాటు పాట ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో ఆస్కార్‌కు నామినేట్ అయినందుకు ఆనందంగా ఉందన్నారు.  రాజమౌళికి ధన్యవాదాలు తెలిపారు. మూరుమూల గ్రామం నుంచి వచ్చి..సామాన్య నేపథ్యం ఉన్న  తనలాంటి  రచయితకు ఇదో గొప్ప విజయంగా అభివర్ణించారు.  నాటు నాటు పాట రాయడానికి చాలా టైం పట్టిందని..ఈ పాటలోని ప్రతీ పదం తన బాల్యం, గ్రామం, కుటుంబానికి సంబంధించిందని చెప్పారు. తన మనసులోని భావాలకు..తన జీవితంలోని జ్ఞాపకాలకు అక్షర రూపం ఇచ్చి నాటు నాటును రాశానని చంద్రబోస్ వివరించారు. 

ఆస్కార్‌ నామినేషన్‌ నాటు నాటు పాటకు చోటు దక్కడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఆస్కార్ ఒరిజనల్ సాంగ్ కేటగిరీలో అవార్డు కోసం  మొత్తం 15పాటలు పోటీ పడుతున్నాయని..ఇందులో నాటు నాటు  ఒకటని చెప్పారు. అవతార్‌ సినిమాలోని సాంగ్స్కు , నాటు నాటు సాంగ్కు మధ్య పోటీ ఉంటుందని భావించానని..అయితే వాటన్నింటిని దాటి ఈ పాట టాప్‌5లో నిలవడం సంతోషంగా ఉందని చెప్పారు.