Golden Globes 2023:'నాటు' పాటకు అవార్డ్.. రాహుల్, చంద్రబోస్ మస్తు ఖుషీ

Golden Globes 2023:'నాటు' పాటకు అవార్డ్.. రాహుల్, చంద్రబోస్ మస్తు ఖుషీ

ఆర్ఆర్ఆర్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇందులోని పాటలు కూడా  సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా 'నాటు నాటు'కు ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ వచ్చింది. అయితే ఈ పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ లో ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఉత్తమ పాటగా ఎంపికైంది. ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ అవార్డును అందుకున్నారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ తో పాటు చంద్రబోస్, కాలబైరవ, రాహుల్ సిప్లిగంజ్ లకు పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.

నాటు నాటు పాటకు ఈ అవార్డ్ దక్కడంపై సింగర్ రాహుల్ సిప్లిగంజ్, సినీ గేయ రచయిత చంద్రబోస్ స్పందించారు. ఈ పాటుకు ఇంత గొప్ప అవార్డు దక్కడం ఎంతో సంతోషంగా ఉందని చంద్రబోస్ అన్నారు. ఈ పాట రాశే అవకాశం ఇచ్చిన కీరవాణికి, దర్శకుడు రాజమౌళికి ధన్యవాదాలు తెలపారు. రాంచరణ్,ఎన్టీఆర్ ల డాన్స్ అద్భతమని చంద్రబోస్ ప్రశంసించారు.ఈ పాట పాడడం నా అదృష్టంగా భావిస్తున్నానని సింగర్ రాహుల్ తెలిపాడు. ఇది ఎంతో అపూర్వమైన, చారిత్రాత్మక విజయమని అన్నాడు. ప్రస్తుతం గోల్డెన్ గ్లోబ్ అవార్డులు-2023 కార్యక్రమం కాలిఫోర్నియాలో జరుగుతోంది.