200 మీ. మెడ్లేలో మార్చండ్‌‌‌‌‌‌‌‌కు స్వర్ణం

200 మీ. మెడ్లేలో  మార్చండ్‌‌‌‌‌‌‌‌కు స్వర్ణం

సింగపూర్: ఫ్రెంచ్‌‌‌‌‌‌‌‌ స్విమ్మింగ్‌‌‌‌‌‌‌‌ సంచలనం లియోన్‌‌‌‌‌‌‌‌ మార్చండ్‌‌‌‌‌‌‌‌.. వరల్డ్‌‌‌‌‌‌‌‌ అక్వాటిక్స్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో స్వర్ణ పతకంతో మెరిశాడు. గురువారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌ 200 మీటర్ల మెడ్లే ఫైనల్లో మార్చండ్‌‌‌‌‌‌‌‌ 1ని.53.68 సెకన్ల టైమింగ్‌‌‌‌‌‌‌‌తో  టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచాడు. ఆల్‌‌‌‌‌‌‌‌టైమ్‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌లో ఇది రెండో అత్యుత్తమ టైమింగ్‌‌‌‌‌‌‌‌ కావడం విశేషం.

 సెమీస్‌‌‌‌‌‌‌‌లో నెలకొల్పిన వరల్డ్‌‌‌‌‌‌‌‌ రికార్డును ఫైనల్లో బ్రేక్‌‌‌‌‌‌‌‌ చేస్తాడని భావించినా రాత్రంతా నిద్రలేమితో బాధపడటం అతనికి మైనస్‌‌‌‌‌‌‌‌గా మారింది. అమెరికన్‌‌‌‌‌‌‌‌ స్విమ్మర్‌‌‌‌‌‌‌‌ షైన్‌‌‌‌‌‌‌‌ కాసాస్‌‌‌‌‌‌‌‌ (1ని, 54.30 సెకన్లు), హంగేరి స్టార్‌‌‌‌‌‌‌‌ హుబర్ట్‌‌‌‌‌‌‌‌ కోస్‌‌‌‌‌‌‌‌ (1ని, 55.34 సెకన్లు) వరుసగా రజతం, కాంస్యం నెగ్గారు. పారిస్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌లో నాలుగు గోల్డ్‌‌‌‌‌‌‌‌ మెడల్స్‌‌‌‌‌‌‌‌ గెలిచిన మార్చండ్‌‌‌‌‌‌‌‌కు సింగపూర్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో ఇది తొలి స్వర్ణం. ఓవరాల్‌‌‌‌‌‌‌‌ కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది ఆరో వరల్డ్‌‌‌‌‌‌‌‌ టైటిల్‌‌‌‌‌‌‌‌. ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌ తర్వాత పోటీల నుంచి సుదీర్ఘ విరామం తీసుకున్న మార్చండ్‌‌‌‌‌‌‌‌ మే నెలలోనే బరిలోకి దిగాడు.