పీఆర్ ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌డీఎస్ మెంబర్ సెక్రటరీగా ఎం. శ్రీనివాస్

పీఆర్ ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌డీఎస్ మెంబర్ సెక్రటరీగా ఎం. శ్రీనివాస్

​హైదరాబాద్​, వెలుగు: పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో సొసైటీ ఫర్ రూరల్​ డెవలప్​మెంట్ సర్వీసెస్ (ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌డీఎస్) మెంబర్ సెక్రటరీగా ఎం. శ్రీనివాస్‌‌‌‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సోమవారం పీఆర్, ఆర్​డీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్​ ఉత్త ర్వులు జారీ చేశారు. స్టేట్ ఫైనాన్షియల్ కార్పొ రేషన్ (ఏపీఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీ)లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌‌‌‌గా పనిచేసిన ఆయనను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేసి, డిప్యుటేషన్‌‌‌‌పై ఈ కొత్త పోస్ట్‌‌‌‌కు నియమించింది.  ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు.