ఇయ్యాళ ‘వీరసింహారెడ్డి’లోని ‘మా బావ మనోభావాలు’ పాట రిలీజ్

ఇయ్యాళ  ‘వీరసింహారెడ్డి’లోని ‘మా బావ మనోభావాలు’ పాట రిలీజ్

సంక్రాంతికి బాలకృష్ణ సినిమా వస్తుండడంతో ఆయన అభిమానులు ఫుల్ జోష్‌‌లో ఉన్నారు. ఒక్కో పాటను విడుదల చేస్తూ ఆ జోష్‌‌ను మరింత పెంచుతున్నారు ‘వీరసింహారెడ్డి’ టీమ్. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ  నుండి ఇటీవల విడుదల చేసిన ‘సుగుణ సుందరి’ సాంగ్ రికార్డు స్థాయి వ్యూస్‌‌ రాబడుతోంది. ప్రమోషన్‌‌లతో మరింత స్పీడు పెంచిన మేకర్స్..  మరో సాంగ్‌‌ రిలీజ్‌‌ డేట్‌‌ను అనౌన్స్‌‌ చేశారు. ‘మా బావ మనోభావాలు’ అంటూ సాగే ఈ పాటను డిసెంబర్ 24న మధ్యాహ్నం 3.19 నిముషాలకు విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొత్త పోస్టర్‌‌‌‌ రిలీజ్ చేశారు.

లేడీ డ్యాన్సర్స్‌‌ మధ్య బ్లాక్ బ్లేజర్, సన్ గ్లాసెస్‌‌తో స్టైలిష్‌‌గా కనిపిస్తున్నారు బాలకృష్ణ. తమన్ కంపోజ్ చేసిన ఈ పాట ‘సెన్సేషనల్ స్పెషల్ సాంగ్ ఆఫ్‌‌ ద ఇయర్‌‌‌‌’గా నిలుస్తుందని చెబుతున్నారు మేకర్స్. ఇక ఇప్పటికే టాకీపార్ట్ పూర్తి కాగా.. త్వరలోనే చివరి పాటను చిత్రీకరించనున్నారు. శ్రుతిహాసన్ హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ దునియా విజయ్, వరలక్ష్మీ శరత్‌‌కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. జనవరి 12న సినిమా విడుదల కానుంది.