
ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికి మా ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉంటుందన్నారు సినీ నటుడు నాగబాబు. ప్రకాశ్ రాజ్ నాన్ లోకల్ అయితే సభ్యత్వం ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. మిమ్మల్ని గెలిపించడానికి పనికొచ్చే ప్రకాశ్ రాజ్... గెలవడానికి పనికిరాడా అని నిలదీశారు. ప్రకాశ్ రాజ్ కు ఉన్న ప్రత్యేకతలు విష్ణులో లేవన్నారు నాగబాబు. ప్రకాశ్ రాజ్ ను పోల్చాలంటే మోహన్ బాబును పోల్చాలని చెప్పారు. నిర్మాతలతో వివాదం ప్రకాశ్ రాజ్ కే కాదు మోహన్ బాబు ఫ్యామాలీకి ఉన్నాయని తెలిపారు.
మరిన్ని వార్తల కోసం