
సత్యం రాజేష్ లీడ్ రోల్‌లో అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర 2’. గౌరీకృష్ణ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా నిర్మాత గౌరీకృష్ణ మాట్లాడుతూ ‘ఇది ఊహించని విజయం. ప్రేక్షకుల నుంచి ఇంత గొప్ప స్పందన వస్తుందని అనుకోలేదు. అందరూ చిన్న సినిమాగానే చూశారు. ఫలితం మాత్రం పెద్ద సినిమాలా వచ్చింది. రోజు రోజుకు వసూళ్లు పెరుగుతున్నాయి. థియేటర్‌లు కూడా పెరిగాయి. ఆడియెన్స్ ప్రతి సన్నివేశాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి ట్విస్ట్‌కు థ్రిల్ ఫీలవుతున్నారు. నేటి సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనల ప్రేరణతో దర్శకుడు ఈ కథను రాసుకున్నాడు. కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉండటంతో అందరూ ఆదరిస్తున్నారు. గీతా ఆర్ట్స్‌కు చెందిన వంశీ నందిపాటి విడుదల చేయడంతో సినిమాకు మరింత ప్లస్ అయ్యింది’ అని చెప్పారు.