
మకావ్: ఇండియా యంగ్ షట్లర్ తరుణ్ మానేపల్లి.. మకావ్ ఓపెన్‌లో సంచలనం సృష్టించాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో అన్‌సీడెడ్, వరల్డ్ 47వ ర్యాంకర్ తరుణ్ 19–21, 21–14, 22–20తో వరల్డ్ 15వ ర్యాంకర్, టాప్‌సీడ్ లీ చుయెక్ యి (హాంకాంగ్)పై గెలిచి క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. సూపర్–300 టోర్నీలో తరుణకు ఇది రెండో క్వార్టర్‌ఫైనల్ కావడం విశేషం. గంటపాటు జరిగిన మ్యాచ్‌లో ఇండియన్ ప్లేయర్ ర్యాలీలు, స్మాష్‌లతో ఆకట్టుకున్నాడు. తొలి గేమ్‌లో స్వల్ప తేడాతో ఓడినా.. తర్వాతి రెండు గేమ్‌ల్లో ధైర్యంగా పోరాడాడు. వరుస పాయింట్లతో ప్రత్యర్థికి ఎక్కడా చాన్స్ ఇవ్వలేదు.
స్పష్టమైన ఆధిక్యంతో ముందుకెళ్లాడు. మరో మ్యాచ్‌లో లక్ష్యసేన్ 21–14, 14–21, 21–17తో చికో అరా ద్వి వార్డయో (ఇండోనేసియా)పై నెగ్గగా, ఆయుష్ షెట్టి 18–21, 16–21తో జస్టిన్ హోహ్ (మలేసియా) చేతిలో ఓడాడు. మెన్స్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి 10–21, 22–20, 21–16తో కకెర్ కుమ్‌గయ్–హిరోకి నిషి (జపాన్)పై గెలవగా, పృథ్వీ కృష్ణ–సాయి ప్రతీక్ 18–21, 18–21తో జునైద్ ఆరిఫ్–రాయ్ కింగ్ యాప్ (మలేసియా) చేతిలో కంగుతిన్నారు. విమెన్స్ సింగిల్స్‌లో రక్షిత రామరాజ్ 21–14, 10–21, 11–21తో బుసానన్ (థాయ్‌లాండ్) చేతిలో, డబుల్స్‌లో ప్రియా–శృతి మిశ్రా 14–21, 12–21తో మెలిసా పుస్పితాసారి–రాచెల్ అలైసా రోస్ (ఇండోనేసియా) చేతిలో ఓడారు.