నారాయణ కాలేజీలో.. ఈ సారి స్టూడెంట్ కాదు.. మహిళా వార్డెన్ ఆత్మహత్య

నారాయణ కాలేజీలో.. ఈ సారి స్టూడెంట్ కాదు.. మహిళా వార్డెన్ ఆత్మహత్య

హైదరాబాద్ నారాయణ కాలేజీలో మరో విషాధం నెలకొంది. రెగ్యులర్ నారాయణ కాలేజీ అనగానే.. స్టూడెంట్స్ ఆత్మహత్యలు లేదా స్టూడెంట్స్ ర్యాంకులు గుర్తుకొస్తాయి. ఎడ్యుకేషన్ ఇయర్ ప్రారంభంలో సహజంగా స్టూడెంట్స్ ఆత్మహత్య జరుగుతుంటాయి. కార్పొరేట్ కాలేజీ నారాయణలో ప్రతిఏటా ఇలాంటి ఘటనలు మామూలే. అయితే ఈసారి అందుకు భిన్నంగా జరిగిన ఘటన సంచలనంగా మారింది. ఆగస్ట్ 18వ తేదీ శుక్రవారం.. హైదరాబాద్ సిటీ నడిబొడ్డున.. హైటెక్ సిటీ సమీపంలోని అయ్యప్ప సొసైటీలో ఉన్న నారాయణ కాలేజీ హాస్టల్ గదిలో.. ఓ మహిళా వార్డెన్ ఆత్మహత్య చేసుకోవటంతో కాలేజీ మొత్తం షాక్ అయ్యింది. స్టూడెంట్స్ భయపడిపోయారు. వివరాల్లోకి వెళితే..

మాదాపూర్ అయ్యప్ప సోసైటిలో నారాయణ కళాశాలలో పనిచేస్తున్న అసిస్టెంట్ వార్డెన్  భవాని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి గ్రామానికి చెందిన భవాని  అదే కాలేజీలో డిగ్రీ చదువుతూ అసిస్టెంట్ వార్డెన్గా పనిచేస్తోంది. అయితే కాలేజీ  గదిలో ఆమె ఫ్యాన్కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. ఉదయం భవాని సూసైడ్ చేసుకుంటే ఈ విషయాన్ని కాలేజీ యాజమాన్యం  మధ్యాహ్నం 1:30 వరకు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదు. దీంతో  భవాని మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మాదాపూర్ నారాయణ కళాశాల సరస్వతి క్యాంపస్లో భవాని నెల క్రితమే  హాస్టల్ వార్డెన్గా చేరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

కాలేజీలో నిత్యం తమతో సరదాగా ఉండే వార్డెన్ భవాని..ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకోవడంతో స్టూడెంట్స్ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అయితే వార్డెన్ ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? అనేది ప్రస్తుతం నారాయణ కాలేజీలో హాట్ టాపిక్గా మారింది. పొద్దున సూసైడ్ చేసుకుంటే మధ్యాహ్నం వరకు కుటుంబ సభ్యులకు ఎందుకు తెలియజేయలేదు.  కాలేజీలో ఏమైనా సమస్య వల్ల ఆమె సూసైడ్ చేసుకుందా ..అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.