మేడారం హుండీ ఆదాయం 10.91 కోట్లు

మేడారం హుండీ ఆదాయం 10.91 కోట్లు

వరంగల్, వెలుగు: మేడారం మహా జాతర హుండీల లెక్కింపు చివరి దశకు వచ్చింది. చిల్లర నాణేలతో డ్రమ్ములు నిండాయి. కౌంటింగ్​ ప్రక్రియలో  కాయిన్ల లెక్కింపునకే ఎక్కువ టైం పడుతోంది. మొదట్లో ఏర్పాటు చేసిన 497 హుండీలకు తోడు తిరుగువారం కోసం పెట్టిన 20 కలిపి మొత్తం 517 బాక్సులను ఓపెన్​ చేశారు. శుక్రవారం నాటికి రూ.10 కోట్ల 91 లక్షల 62,765 ఆదాయం వచ్చింది. హుండీల్లోని కరెన్సీ నోట్లు పసుపు, కుంకుమ, బెల్లంతో రంగు మారాయి. సిబ్బంది ఒక్కో నోటును నీటిలో కడిగి అనంతరం వాటిని ఆరబెట్టి ఇస్త్రీ చేస్తున్నారు. భక్తులు వేసిన చిల్లర నాణేలను వేరు వేరుగా డ్రమ్ముల్లో నింపారు. చిల్లర నాణేల విలువ రూ. 45 లక్షల నుంచి 50 లక్షల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. జాతరలో దొరికిన పర్సులను భక్తులు హుండీల్లో వేశారు. లెక్కింపు సమయాల్లో ఇలాంటివి పెద్ద ఎత్తున బయటపడ్డాయి. 

మల్లన్న హుండీ ఆదాయం రూ. 1.12 కోట్లు
కొమురవెల్లి: కొమురవెల్లి మల్లికార్జునస్వామి హుండీ ఆదాయం రూ. కోటి 12 లక్షల 47,992 వచ్చింది. శుక్రవారం ఆలయ ముఖమండపంలో ఈవో బాలాజీ, చైర్మన్ గీస భిక్షపతి ఆధ్వర్యంలో పోలీసుల బందోబస్తు, సీసీ కెమెరా నిఘాలో 26 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించారు. మిశ్రమ బంగారం 135 గ్రాములు, మిశ్రమ వెండి 9 కిలోల 800 గ్రాములు, 13 విదేశీ కరెన్సీ నోట్లు, 3,950 కిలోల బియ్యం సమకూరాయి.

ఏడుపాయల జాతర  ఆదాయం రూ. 71 లక్షలు 
పాపన్నపేట: ఏడుపాయల జాతర ఆదాయం రూ. 71 లక్షల 38,090 సమకూరినట్లు ఈవో సార శ్రీనివాస్​చెప్పారు. శుక్రవారం జాతర ఉత్సవాల హుండీ లెక్కింపు భ్రమరాంబిక సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో గోకుల్ షెడ్డులో నిర్వహించారు. బంగారు, వెండి వస్తువులు మినహా హుండీ ఆదాయం రూ. 33 లక్షల58,980,  ప్రసాదాలు, ఒడిబియ్యం, తాత్కాలిక దుకాణాలు, కేశఖండనం ద్వారా రూ. 37 లక్షల79,110  వచ్చాయి. 

For more news..

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావొచ్చు

ఇండ్ల స్థలాల లెక్కనే వ్యవసాయ భూముల రెగ్యులరైజేషన్