ఇండ్ల స్థలాల లెక్కనే వ్యవసాయ భూముల రెగ్యులరైజేషన్​

ఇండ్ల స్థలాల లెక్కనే వ్యవసాయ భూముల రెగ్యులరైజేషన్​
  • అసైనీలకు ప్రయోజనం..  సర్కార్​కు ఆదాయం 
  • ఇతర రాష్ట్రాల మాదిరి హక్కులు కల్పించాలని యోచన
  • రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు

హైదరాబాద్, వెలుగు: ఎలాంటి వివాదాల్లేని అసైన్డ్ భూముల రెగ్యులరైజేషన్​కు సర్కారు సిద్ధమవుతున్నది. అసైనీలకు శాశ్వత హక్కులు కల్పించడం, ఆదాయం సమకూర్చుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. ప్రభుత్వ భూముల్లో ఉన్న ఇండ్ల స్థలాల రెగ్యులరైజేషన్​కు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. అదేపద్ధతిలో వ్యవసాయ అసైన్డ్ భూముల రెగ్యులరైజేషన్​కు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. అసైన్డ్ ల్యాండ్స్​లోనూ ఏ రకమైన భూములు క్రమబద్ధీకరించాలి.. రెగ్యులరైజేషన్  ఫీజు ఎంత నిర్ణయించాలి.. కాస్తులో ఎన్నేండ్లు ఉంటే శాశ్వత హక్కులు కల్పించాలనే అంశాలపై ప్రధానంగా రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.  ఏడాదిన్నర కిందట్నే అసైన్డ్ భూముల  క్రమబద్ధీకరణ అంశం చర్చకు వచ్చినప్పటికీ.. అప్పట్లో ఈ ప్రతిపాదనను పక్కనబెట్టిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మళ్లీ దృష్టి సారించినట్లు తెలిసింది. 

భూసేకరణ సమయంలో పరిహారం ఇచ్చుడు తప్పుతలేదని..!
రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల కోసం, ప్రభుత్వ అవసరాల కోసం భూసేకరణ చేసినప్పుడు పట్టా భూములతోపాటు అసైన్డ్ భూములకు కూడా ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు హైవేలు, ఇతర ప్రాజెక్టులు, పరిశ్రమల కోసం తెలంగాణ ఏర్పాటు తర్వాత సుమారు 3 లక్షల ఎకరాల భూములు సేకరించారు. ఈ సందర్భంగా అసైన్డ్ భూములు సేకరించినా బాధిత రైతులకు పరిహారం చెల్లించారు. పేరుకు సర్కార్ భూములే అయినా అసైనీలకు కూడా పట్టాదారులతో సమానంగా పరిహారం చెల్లించాల్సిందేనని గతంలో కోర్టు తీర్పులున్నాయి. అసైన్డ్ ల్యాండ్స్ అయినప్పటికీ వాటిని ఏకపక్షంగా స్వాధీనం చేసుకునే అధికారం సర్కార్ కు లేకపోవడంతో రెగ్యులరైజేషన్ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. 

ల్యాండ్ పూలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అర్బన్ ఏరియాల్లో అసైన్డ్ భూములు
హైదరాబాద్ మహానగరం సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల 40 కిలోమీటర్ల దూరంలో రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్​ఆర్​ఆర్​) నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. రీజినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రింగు రోడ్డుకు ఇరువైపులా ఉన్న అన్ని గ్రామాల్లో అసైన్డ్ ల్యాండ్స్ ను వెనక్కి తీసుకునేందుకు చర్యలు చేపట్టింది. ఆర్ఆర్ఆర్ పరిధిలోని తహసీల్దార్ల నుంచి ఇప్పటికే వివరాలు తెప్పించుకున్న ప్రభుత్వం.. ఈ భూముల్లో వెంచర్లు అభివృద్ధి చేసి, రోడ్డు కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు ప్రత్యామ్నాయంగా ప్లాట్లను ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. అసైన్డ్ ల్యాండ్స్ ఓనర్లకు కూడా ఇందులోనే ప్లాట్లు ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. తద్వారా రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ వ్యయాన్ని కూడా భారీగా తగ్గించుకోవచ్చని భావిస్తున్నట్లు తెలిసింది. అలాగే రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో అసైన్డ్ ల్యాండ్స్ ను కూడా పూలింగ్ చేసి వెంచర్లుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. 

ఇతర రాష్ట్రాల్లో అసైనీలకు శాశ్వత హక్కులు
మన రాష్ట్రంలో అసైన్డ్ ల్యాండ్స్ పొందిన అసైనీలు తరతరాలుగా ఆ భూములను సాగు చేసుకోవడం తప్ప అవసరాల కోసం ఇతరులకు అమ్ముకోవడానికి లేదు. స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ సైనికులకు ఇచ్చిన భూములు మాత్రం పదేండ్ల తర్వాత అమ్ముకునే హక్కు ఉంది. కానీ ఈ హక్కు కూడా రాష్ట్రంలో అమలు కావడం లేదు. మన పక్కనే ఉన్న కర్నాటకలో మాత్రం అసైన్డ్ చేసిన 15 ఏండ్ల తర్వాత, తమిళనాడులో 20 ఏండ్ల తర్వాత, కేరళలో 25 ఏండ్ల తర్వాత, మధ్య ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లో 10 ఏండ్ల తర్వాత అర్హతను బట్టి అక్కడి ప్రభుత్వాలు అసైనీలకు భూములపై శాశ్వత హక్కులను కల్పిస్తున్నాయని అసైన్డ్ భూములకు శాశ్వత హక్కుల సాధన సమితి నేత గుమ్మి రాజ్ కుమార్ రెడ్డి చెప్పారు.  కానీ మన రాష్ట్రంలో 50, 60 ఏండ్లయినా అసైన్డ్ ల్యాండ్ పై ఆయా కుటుంబాలకు శాశ్వత హక్కులు దక్కడం లేదు. ఏదైనా ఆర్థికపరమైన, అనారోగ్యపరమైన అత్యవసర పరిస్థితి తలెత్తినా, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చినా భూములు అమ్ముకోలేని దుస్థితి నెలకొంది.

రాష్ట్రంలో అసైన్డ్ భూముల లెక్కలు ఇట్లా..
వాస్తవానికి అసైన్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూముల బదలాయింపు నిషేధ చట్టం–1977 ప్రకారం పేదలకు అసైన్డ్​ చేసిన భూములను మరొకరికి అమ్మడానికి వీల్లేదు. ఈ విషయం తెలియని అనేక మంది రైతులు అవసరాల కోసం ప్రభుత్వం ఇచ్చిన భూములు అమ్మేసుకున్నారు. రాష్ట్రంలో చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన (ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూపీ)లో అసైన్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూముల కొనుగోళ్ల వ్యవహారం పెద్ద సంఖ్యలో వెలుగు చూసింది. రాష్ట్ర ప్రభుత్వం 1956 నుంచి 2014 వరకు 22,55,617 ఎకరాలను 13,88,530 మందికి అసైన్డ్ చేసింది. ఇందులో 2,41,749 ఎకరాలను 84,706 మందికి అమ్ముకున్నట్లు భూరికార్డు  ప్రక్షాళన సందర్భంగా గుర్తించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా అసిఫాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 1,85,101 ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెంలో 1,66,557 ఎకరాలు, నల్గొండలో 1,36,686 ఎకరాలు, కామారెడ్డిలో 1,33,157 ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయి. ఇందులో 6,33,451 మంది బీసీల వద్ద 8,14,008 ఎకరాలు ఉండగా, ఎస్సీల వద్ద 5,75,497 ఎకరాలు, ఎస్టీల వద్ద 6,72,959 ఎకరాలు, ఓసీల వద్ద 1,46,102 ఎకరాలు, మైనార్టీల వద్ద 54,565 ఎకరాలు ఉన్నట్లు భూరికార్డుల ప్రక్షాళనలో తేలింది.

ఈ అసెంబ్లీ సెషన్​లోనే ప్రకటన
రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా బహిరంగ మార్కెట్ లో ఎకరం ధర రూ. 15 లక్షలపైనే పలుకుతున్నది. ఇదే విషయాన్ని పలుమార్లు సీఎం కేసీఆరే స్వయంగా ప్రకటించారు. హెచ్ఎండీఏ పరిధిలో అయితే ఎకరం రూ. కోట్లలో నడుస్తున్నది. అందుకే ప్రభుత్వం భవిష్యత్ అవసరాల దృష్ట్యా హెచ్ఎండీఏ తోపాటు ఇతర పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోని అసైన్డ్ భూములను మినహాయించి ఇతర ప్రాంతాల్లోని వ్యవసాయ భూములను మాత్రమే రెగ్యులరైజ్ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఏడాది కిందట్నే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అసైన్డ్ భూముల వివరాలు, వాటి పరిస్థితిపై రెవెన్యూ అధికారులు రిపోర్టులను ప్రభుత్వానికి అందజేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే అసైన్డ్ భూముల రెగ్యులరైజేషన్​పై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.