సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం : ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం : ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

కోదాడ, వెలుగు: అత్యవసర పరిస్థితుల్లో, ఆపదలో ఉన్న వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ వరంలా ఉపయోగపడుతుందని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  ఆర్థికంగా వెనుకబడిన వారు కార్పొరేట్ ఆసుపత్రులలో చికిత్స పొందడానికి సీఎం రిలీఫ్ ఫండ్ ఉపయోగపడుతుందన్నారు.

 సీఎం రిలీఫ్ ఫండ్ ను అర్హులైన వారు సద్వినియోగం చేసుకొని ఆరోగ్యం రక్షించుకోవాలని కోరారు. వివిధ మండలాలకు చెందిన 267 మందికి మంజూరైన రూ. 87.78 లక్షల విలువైన చెక్కులను ఆమె అందజేశారు. కార్యక్రమంలో పలు మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.