
యాదగిరిగుట్ట, వెలుగు: కెనడాలోని వాంకోవర్ నగరంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. లోక కల్యాణం, ప్రపంచశాంతి, సర్వజనులు సుఖసంతోషాలతో ఉండాలనే సంకల్పంతో.. తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆహ్వానం మేరకు యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో కెనడాలోని పలు నగరాల్లో స్వామివారి కల్యాణాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం రాత్రి వాంకోవర్ నగరంలో లక్ష్మీనారసింహుల కల్యాణాన్ని నిర్వహించారు.
యాదగిరిగుట్ట దేవస్థానం ఏఈవో గజవెల్లి రఘు స్వీయ పర్యవేక్షణలో లక్ష్మీనరసింహస్వామి కల్యాణం నయనానందకరంగా నిర్వహించారు. యాదగిరిగుట్ట టెంపుల్ మాజీ ప్రధానార్చకులు నల్లంతిఘల్ లక్ష్మీనరసింహాచార్యుల అర్చకత్వంలో స్వామిఅమ్మవార్ల కల్యాణం వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కల్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనితరించారు.