స్వస్త్ నారీ, సశక్తి పరివార్ను పకడ్బందీగా అమలు చేయాలి

స్వస్త్ నారీ, సశక్తి పరివార్ను పకడ్బందీగా అమలు చేయాలి

జనగామ అర్బన్, వెలుగు: మహిళలు, పిల్లలకు మెరుగైన ఆరోగ్య సేవల కోసం స్వస్త్ నారీ, సశక్తి పరివార్​అభియాన్​ కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని జనగామ కలెక్టర్​ రిజ్వాన్​ భాషా షేక్ అధికారులను ఆదేశించారు. 

ఆదివారం ఆయన మాట్లాడుతూ మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవల ద్వారా మహిళలు, పిల్లల సాధికారతే లక్ష్యంగా స్వస్త్​నారి, సశక్త్​ పరివార్​అభియాన్​కార్యక్రమం ఈ నెల 17 నుంచి అక్టోబర్​ 2 వరకు నిర్వహిస్తున్నారని, ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా రూపొందించిన ముఖ్యమైన సేవలను అందించనున్నట్లు తెలిపారు. 

ఆయుష్మాన్​ ఆరోగ్య మందిరాలు, అవగాహన, ప్రవర్తన మార్పు సెషన్లు, నిక్షయ్​మిత్ర నమోదు డ్రైవ్, మెగా రక్తదాన కార్యక్రమం, ప్రైవేట్​రంగం భాగస్వామ్యం, పోషన్​మాహ్​తో కన్వర్జెన్స్​ఈ శిబిరాలు అంతటా నిర్వహిస్తామన్నారు. పీహెచ్​సీలు, హాస్పిటల్స్​లో మహిళలు, పిల్లల నిర్దిష్ట అవసరాలపై దృష్టి సారించి, అన్ని అంగన్​వాడీల్లో పోషన్​ మాహ్​ వేడుకలతోపాటు ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తాయని కలెక్టర్​ చెప్పారు.