మాజీ మంత్రి దామోదర్ రెడ్డి జన్మదిన వేడుకలు

 మాజీ మంత్రి దామోదర్ రెడ్డి జన్మదిన వేడుకలు

సూర్యాపేట, వెలుగు: మాజీ మంత్రి సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి రాంరెడ్డి దామోదర్ రెడ్డి జన్మదిన వేడుకలు సూర్యాపేట, తుంగతుర్తి నియోజక వర్గాల్లో  కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు.  వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సూర్యాపేట కొత్త బస్టాండ్ ఫ్లై ఓవర్ వద్ద అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేశారని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆయన కొండంత అండగా నిలిచారన్నారు. 

దామోదర్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు, రక్త దాన శిబిరాలు నిర్వహించారు.  టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అంజద్ అలి, దండు మైసమ్మ దేవాలయ చైర్మన్ తంగళ్ల కరుణాకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ వేములకొండ పద్మ, కుంభం రాజేందర్, సాజిద్, ఆలేటి మాణిక్యం, మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 తుంగతుర్తి,  వెలుగు: ప్రజా జీవితంలో 47 ఏళ్లు ఎన్నో పోరాటాలు చేసిన నాయకుడు మాజీ మంత్రి దామోదర్ రెడ్డి అని తెలంగాణ రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న యాదవ్ అన్నారు. మాజీ మంత్రి దామోదర్ రెడ్డి జన్మదిన వేడుకలను మండల కేంద్రంలోని ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాగేల్లి అరుణ్ కుమార్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. 

జిల్లా మహిళా అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు కార్యకర్తలతో కలిసి కేక్‌‌‌‌‌‌‌‌ కట్ చేశారు. కాంగ్రెస్ నాయకులు గుడిపాటి నరసయ్య , కోరికొప్పుల నరేష్, గుడిపాటి సైదులు, దొంగరి గోవర్ధన్ మడ్డి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.