
శివకార్తికేయన్, రుక్మిణీ వసంత్ జంటగా మురుగదాస్ డైరెక్షన్‌లో ఎన్వీ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘మదరాసి’. సెప్టెంబర్ 5న తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదల కానుంది. తాజాగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ సందర్భంగా శివకార్తికేయన్ మాట్లాడుతూ ‘మురుగదాస్ గారితో కలిసి వర్క్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. సాలిడ్ ఫిల్మ్ ఇచ్చారు. ఇందులో లవ్, యాక్షన్ రెండు పిల్లర్స్. అందులో లవ్ పోర్షన్ బాగా రావడానికి రుక్మిణి కారణం అయితే.. విద్యుత్ జమ్వాల్‌తో చేసిన యాక్షన్ సీక్వెన్సులు చాలా క్రేజీగా ఉంటాయి. అనిరుధ్ హిట్ మిషన్. ఆయన ఇచ్చే పాటలన్నీ సూపర్ హిట్ అవుతాయి.
ప్రసాద్ గారు క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. నేను నటించిన రెమో, వరుణ్ డాక్టర్, డాన్, మహావీరుడు, అమరన్ చిత్రాలకు మంచి సపోర్ట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని కూడా ఆదరిస్తారని నమ్ముతున్నా’ అని అన్నాడు.
ఈ సినిమా తనకు చాలా స్పెషల్ అని రుక్మిణీ వసంత్ చెప్పింది. నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ ‘ఈ సినిమా విజువల్ వండర్‌గా ఉంటుంది. శివ కార్తికేయన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది’ అని అన్నారు.