డ్రగ్స్ కేసులో ఇటీవల అరెస్టైన బాలీవుడ్ నటి క్రిసాన్ పెరీరా జైలు నుండి విడుదల జైలు నుండి విడుదలైంది. డ్రగ్స్ ఆరోపణలతో ఆమె ఈ నెల 1న షార్జాలో అరెస్టయిన సంగతి తెలిసిందే. అయితే పథకం ప్రకారమీ ఆమెను ఈ కేసులో ఇరికించారని, దీనివెనుక పెద్ద కుట్ర జరిగిందని ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగానే అసలు నిందితులు ఆంథోనీ పాల్, అతని సన్నిహితుడు రాజేష్ బబొటేలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
అయితే, 26 రోజుల జైలు జీవితం తర్వాత బుధవారం (ఏప్రిల్ 26) సాయంత్రం విడుదలైన క్రిసాన్ పెరీరా.. తన జైలు జీవితం గురించి వివరిస్తూ బాధ పడింది.
‘డియర్ వారియర్స్.. శత్రువులకు కూడా జైలు గతి పట్టాలని కోరుకోకండి. నేను జైలులో ఉన్న ఈ 26 రోజులు నరకం అనుభవించా. చుట్టూ తెలియని వాళ్లు.. నాలుగు గోడల మధ్య ఎలా గడిపానో నాకే తెలుసు. నాకు పెన్, పేపర్ దొరకడానికి మూడు వారాల టైం పట్టింది. టైడ్ సర్ఫ్ తో తల స్నానం చేశా. టాయిలెట్ వాటర్ తో చేసిన కాఫీ తాగా’ అంటూ తన జైలు జీవితాన్ని వివరించింది.