రాష్ట్రంలో గవర్నర్ కు విలువ లేకుండా చేశారు

రాష్ట్రంలో గవర్నర్ కు విలువ లేకుండా చేశారు
  • రాష్ట్రంలో గవర్నర్ కు విలువ లేకుండా చేశారు
  • యాక్షన్ ప్లాన్ తో కేసీఆర్ సానుభూతి పొందాలని చూస్తుండు

మంత్రి జగదీష్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే జిల్లాలో జరిగిన ధాన్యం కొనుగోలు అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. వేసంగిలో ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు డ్రామాలు ఆడుతూ రైతులను ఆగం చేస్తున్నాయన్నారు. కేసీఆర్ ఏ పని చేసినా అంతర్గతంగా అది బీజేపీకి లాభం చేసే విధంగా ఉంటుందన్నారు. కేసీఆర్ మూలాలు బీహార్ లో ఉన్నాయని, అందుకే ఆయన బీహార్ అధికారులపై అతి ప్రేమ చూపుతున్నారన్నారు. అధికారం, ఆదాయం మాత్రం తెలంగాణ ప్రజలపై తీర్చుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని...మంత్రి హత్యకు కుట్ర అనే డ్రామాకు తెరలేపారని తెలిపారు. ప్రశాంత్ కిషోర్ యాక్షన్ ప్లాన్ ను కేసీఆర్ రాష్ట్రంలో  అమలు చేసి సానుభూతి పొందాలని చూస్తున్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో గవర్నర్  కు విలువ లేకుండా చేశారని అన్ని అధికార వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని కేసీఆర్ రాచరిక పాలన చేయాలని చూస్తున్నాడని సీతక్క సీరియస్ అయ్యారు.

 

మరిన్ని వార్తల కోసం

లండన్ నుంచి భారత్కు.. సద్గురు బైక్ యాత్ర
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్ డేట్స్