హైదరాబాద్ మాదాపూర్ లోని కేబుల్ బ్రిడ్జిపై ఎన్ని అంక్షలు పెడుతున్నప్పటికీ కొంతమంది డ్రైవర్ల నిర్లక్ష్యంతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కేబుల్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్ అత్యుత్సాహంతో ముందు వెళ్తున్న బైక్ ను తప్పించబోయి ఓవర్ టెక్ చేశాడు. దీంతో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ముగ్గురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
— GSREDDY (@GSreddymedia) August 24, 2023