విలాసవంతంగా గడిపేందుకు.. అన్నను కిడ్నాప్ చేయించిన చెల్లెలు

విలాసవంతంగా గడిపేందుకు..  అన్నను కిడ్నాప్ చేయించిన చెల్లెలు

రాయదుర్గం పీఎస్ పరిధిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి సురేందర్ కిడ్నాప్ కేసులో నిందితులను విచారించడంతో సంచలన విషయాలు బయటికొచ్చాయి. కిడ్నాప్ కు గురైన సురేందర్ సోదరినే  ప్రధాని సూత్రధారి అని పోలీసులు తేల్చారు. జనవరి 4న సాయంత్రం కాజాగూడ చెరువు వద్ద తన చెల్లెలితో మాట్లాడుతుండగా సురేందర్ ను సురేష్ గ్యాంగ్ కిడ్నాప్ చేసింది.  జనవరి 7వ తేదీన ఈ ఘటనపై మాదాపూర్ ఇంచార్జ్ డీసీపీ శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.

డీసీపీ ప్రెస్ మీట్ పాయింట్స్..

  • ఈనెల 4వ తేదీన ఖాజగూడ వద్ద సురేందర్ అనే వ్యక్తి కిడ్నాప్ అయనట్టు డయల్ హండ్రెడ్ ద్వారా సమచారం అందింది.
  • కిడ్నాప్ కేసును 48 గంటల్లో చేదించాము.
  • అరున్ననకు కిడ్నాప్ సమాచారం అందగానే వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నాం
  • అక్కడ ఉన్న వారు బాధితుడి కజిన్ నిఖితతో వచ్చిన వారే కిడ్నాప్ చేశారు అని చెప్పారు..
  • దీంతో నిఖితను ప్రశ్నించాము...ఆమె ఇచ్చిన సమాచారం మేరకు అరు టింలను ఫామ్ చేశాం.
  • నిఖిత, వెంకటకృష్ణ, సురేష్ లు.. ఈ కిడ్నాప్ కేసులో కీలకంగా వ్యవహరించారు.
  • సురేందర్ ను కిడ్నాప్ చేసి 6 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు.
  • పోలీసులు వెంటపడుతున్నారని తెలిసి.. కిడ్నాప్ అయినా సురేందర్ చేత వాలంటీర్ గా వెళుతున్నానని చెప్పించారు.
  • విచారణ అవసరం లేదు.. వాలంటీర్ గా తానే వచ్చేస్తున్నట్టు చెప్పించారు.
  • పవన్ కల్ రోడ్ లో వెళ్తున్న సమయంలో కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న కారు ఆగిపోయింది.
  • అనంతరం నికిత.. కిడ్నాప్ అయినా సురేందర్ కుటుంబ సభ్యుల కారణం వెంకటకృష్ణకు ఇచ్చి పంపింది.
  • సురేందర్ ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న సమయంలో కర్తాల్ వద్ద ఫారెస్ట్ అధికారులు ఆపారు.
  • ఫారెస్ట్ అధికారులను చూసి కిడ్నాపర్లు పారిపోయారు..  సురేందర్ ను ధికారులు సేవ్ చేశారు.
  • ముందుగా రూ. 2 కోట్లు డిమాండ్ చేసి అనంతరం రూ.20 లక్షలు ఇచ్చినా చాలు అన్నారు.
  • కిడ్నాప్ లో పాలుపంచుకున్న సురేష్ పై 21 కేసులు ఉన్నాయి
  • నికిత, వెంకటకృష్ణ ఒకే చోట ఉద్యోగం చేస్తారు.. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు.
  • కిడ్నాప్ చేసి వచ్చిన డబ్బుతో విలాసంవంతగా గడపాలనుకున్నారు.
  • ఈ గ్యాంగ్ గచ్చిబౌలిలోని ఒక కిడ్నాప్ కేసులో కూడా ఉన్నారు.
  • తెలిసినవాళ్లని బెదిరించడం ఎంతో కొంత డిమాండ్ చేసి దండుకోవడం వీరు చేసే పని.
  • నిందితులపై గ్యాంగ్ ఫైల్ ఓపెన్ చేస్తాం.. ప్రధాన నిందితుడిపై పీడీ యాక్ట్ పెడతాం.
  • వెంకటకృష్ణ పై జీడిమెట్ల పిఎస్ లో ఎన్డీపిఎస్ కేసుతోపాటు మరొక కిడ్నాప్ కేసు  కూడా ఉంది.