
డైరెక్టర్ క్రిష్ కు డ్రగ్ పరీక్షలు చేస్తామన్నారు మాదాపూర్ డీసీపీ వినీత్. డ్రగ్స్ తీసుకున్న అనుమానితుల జాబితాలో డైరెక్టర్ క్రిష్ ఉన్నారని తెలిపారు. క్రిష్ ను విచారిస్తాం.. ఆయనకు రక్త,మూత్ర పరీక్షలు చేస్తే అసలు విషయం ఏంటో తెలుస్తుంది. క్రిష్ విచారణకు హాజరవుతానని చెప్పారని తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు.
ALSO READ :- కైలాస మానస సరోవరం ప్రాముఖ్యత తెలుసా...
గచ్చిబౌలి రాడిసన్ హోటల్ లో కొకైన్ సేవించిన కేసులో డ్రగ్ సరఫరా చేసిన సయ్యద్ అబ్బాస్ ను అరెస్టు చేశామని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. అబ్బాస్ ఇచ్చిన స్టేట్మెంట్ లో ఇప్పటి వరకు పదిసార్లు గజ్జెల వివేకానంద్ కు డెలివరీ చేసినట్లు చెప్పాడు. సేమ్ హోటల్లో గతంలో కూడా పార్టీ చేసుకున్నారు.శ్వేత, సందీప్ పరారీలో ఉన్నారు.చరణ్ బెంగళూరులో ఉన్నాను, వస్తున్నానని చెప్పాడు.హోటల్ నిర్వాహకులపై కేసులు పెడతాం.అబ్బాస్ పదిసార్లు డ్రగ్స్ తెచ్చాడు, ఎక్కడి నుండి తెచ్చాడో విచారిస్తున్నాం. ఇన్ని సార్లు ఎక్కడి నుండి తెస్తున్నాడో విచారిస్తున్నాము.సరఫరా చేసిన ప్రతిసారి నాలుగు గ్రాముల కొకైన్ సరఫరా చేశాడని తెలిసింది.వివేకానంద్ డ్రగ్ పార్టీ లు ఎందుకు చేస్తున్నాడో విచారిస్తాము అని డీసీపీ వినీత్ మీడియాకు తెలిపారు.