The Railway Men Teaser : గుండెలకు హత్తుకునే ఎమోషన్.. ది రైల్వే మెన్‌ టీజర్

The Railway Men Teaser :  గుండెలకు హత్తుకునే ఎమోషన్.. ది రైల్వే మెన్‌ టీజర్

1984 డిసెంబర్ 3 అర్ధరాత్రి జనాలు బాగా నిద్రపోతున్న టైం. ఒక్కసారిగా గ్యాస్ ఉత్పాతం విరుచుకుపడింది. చాలా మందిని నిద్రలోనే చంపేసింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని యూనియన్‌ కార్బైడ్‌ ఇండియా లిమిటెడ్‌(UCIL) ప్లాంట్‌లో మిథైల్‌ ఐసోసైనైడ్‌ అనే విషపూరిత రసాయనం విడదల కావడంతో చాలామంది ఊపిరాడక ప్రాణాలు కోల్పోగా, వేలమంది తీవ్రంగా గాయపడ్డారు.

ఈ దుర్ఘటన జరిగి దాదాపు 39 ఏళ్లు పూర్తికావొస్తోంది. రీసెంట్గా ఈ దుర్ఘటనకు సంబంధించిన వాస్తవ సంఘటనల ఆధారంగా చేసుకుని ది రైల్వే మెన్‌ (వెబ్‌ సిరీస్‌) రూపొందుతోందని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. 

లేటెస్ట్గా ది రైల్వే మెన్‌ (The Railway Men) టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సిరీస్ లో మాధవన్‌ (Madhavan), దివ్యేందు, కేకే మీనన్‌, బాబిల్‌ ఖాన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ టీజర్ లో గుండెలకు హత్తుకునే ఎమోషన్ సీన్స్ చూపించారు. వరల్డ్ బిగ్గెస్ట్ వరస్ట్ ఇండస్ట్రియల్ డిజాస్టర్ అయిన ఈ మూవీలో ప్రతి పాత్ర అందరిని కదిలిస్తుందని మేకర్స్ తెలిపారు. ఇక నాలుగు భాగాలుగా రానున్న ఈ సిరీస్‌ ను నవంబర్ 18 నుంచి నెట్ఫ్లిక్ (Netflix) లో స్ట్రీమింగ్ కానుంది.

భోపాల్‌ గ్యాస్‌ లీక్‌ (Bhopal Gas Leak) ప్రమాదం జరిగినప్పుడు..అక్కడ చిక్కుకున్న వారి ప్రాణాలను కాపాడిన రైల్వే ఉద్యోగుల జీవిత కథ ఆధారంగా ది రైల్వే మెన్‌ తెరకెక్కించినట్లు డైరెక్టర్ శివ్‌ రావలి (Shiv Rawail) తెలిపారు.

ఇప్పటిదాకా ఆ ప్రమాదంలో 16 వేల మంది దాకా చనిపోయారని ఓ అంచనా. ప్రమాదం జరిగిన రోజు 2,259 మంది చనిపోయినట్టు అప్పుడు అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత రెండు వారాలకు మొత్తం 8 వేల మంది బలయ్యారు. ఆ గ్యాస్ వల్ల కలిగిన సైడ్ ఎఫెక్ట్స్  తో మరో 8 వేల మంది చనిపోయారు. 5,74,366 మంది దానికి బాధితులయ్యారు. ఇప్పటికీ అక్కడోళ్ల ను ఆ ప్రమాదం వెంటాడుతూనే ఉంది.