దేశంలోనే అతిపెద్ద విపత్తుపై వెబ్ సిరీస్.. ఆసక్తిరేపుతున్న రిలీజ్ వీడియో

దేశంలోనే అతిపెద్ద విపత్తుపై వెబ్ సిరీస్.. ఆసక్తిరేపుతున్న రిలీజ్ వీడియో

1984 మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన గ్యాస్‌ లీక్‌ ప్రమాదం ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక విపత్తు. యూనియన్‌ కార్బైడ్‌ ఇండియా లిమిటెడ్‌(UCIL) ప్లాంట్‌లో మిథైల్‌ ఐసోసైనైడ్‌ అనే విషపూరిత రసాయనం విడదల కావడంతో చాలామంది ఊపిరాడక ప్రాణాలు కోల్పోగా, వేలమంది తీవ్రంగా గాయపడ్డారు. అంతేకాదు.. మరో 6 లక్షల మందిపై ప్రభావం చూపించింది ఈ  గ్యాస్‌ లీకేజీ ప్రమాదం. దాదాపు కొన్ని తరాల పాటు కనిపించింది ఈ విషపూరిత రసాయన ప్రభావం. ఈ దుర్ఘటన జరిగి దాదాపు 39 ఏళ్లు పూర్తికావొస్తోంది.

ఈ దుర్ఘటనకు సంబందించిన వాస్తవ సంఘటనల ఆధారంగా చేసుకుని ఓ వెబ్‌ సిరీస్‌ రూపొందుతోంది. ద రైల్వే మెన్‌(The Railway men) టైటిల్ తో వస్తున్న ఈ సిరీస్ లో మాధవన్‌, దివ్యేందు, కేకే మీనన్‌, బాబిల్‌ ఖాన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నాలుగు భాగాలుగా రానున్న ఈ సిరీస్‌ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ వీడియో రిలీజ్‌ చేశారు మేకర్స్. భోపాల్‌ గ్యాస్‌ లీక్‌ ప్రమాదం జరిగినప్పుడు.. అక్కడి ప్రజలను కాపాడేందుకు రైల్వే ఉద్యోగులు సహాయం అందించారు, వందల మందిని కాపాడారు. వాటినే ఈ సిరీస్ లో చూపించబోతున్నామని దర్శకుడు శివ్‌ రావలి తెలిపారు. నవంబర్‌ 18 నుంచి ఈ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

ALSO READ :- IPL 2024: విదేశాల్లో ఐపీఎల్ 2024 వేలం.. ఎప్పుడు, ఎక్కడంటే..?