ఎమ్మెల్యే కి సవాల్ విసిరిన బీజేపీ కూకట్ పల్లి ఇంఛార్జి మాధవరం కాంత రావు

ఎమ్మెల్యే కి సవాల్  విసిరిన  బీజేపీ కూకట్ పల్లి ఇంఛార్జి మాధవరం కాంత రావు

కూకట్ పల్లి లోని కాముని చెరువు  కబ్జాలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. గత కొన్నాళ్లుగా కాముని చెరువులో కొందరు అక్రమార్కులు మట్టి తరలిస్తూ దాన్ని పూడ్చి కబ్జాలకు పాల్పడుతున్నారు. దీనిపై మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్ వేదికగా పలువురు ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించిన ఆయన... కబ్జాలకు పాల్పడుతున్న వారిపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే కాముని చెరువు కబ్జాకు గురవుతుందంటూ కూకట్ పల్లి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారులు పేర్కొన్న కబ్జారాయుళ్లపై కేసు నమోదు చేశామని కూకట్ పల్లి సీఐ నర్సింగరావు వెల్లడించారు. దీనిపై పూర్తి దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే కి సవాల్ 

కాముని చెరువు కబ్జాలకు పాల్పడుతుంది ఎమ్మెల్యే కృష్ణారావు, అధికార పార్టీ కార్పొరేటర్ల అనుచర వర్గమేనని, వారే వెనకుండి నడిపిస్తున్నారని బీజేపీ నాయకులు కాంతారావు ఆరోపించారు. పేదలు చిన్న గుడిసెలు వేసుకుంటేనే హడావుడి చేసే అధికారులు.. 40 ఎకరాల పై చిలుకు ఉన్న కాముని చెరువు కబ్జాలకు గురవుతుంటే చోద్యం చూస్తున్నారని విమర్శించారు. కాముని చెరువు కబ్జాలకు గురవుతుందని సామాన్యులు మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేస్తే తూతూ మంత్రంగా రోజువారి కూలీల మీద కేసులు నమోదు చేశారన్నారు. కానీ వెనకాల ఉండి కబ్జాలకు ప్రోత్సహిస్తున్న నాయకులను మాత్రం వదిలేశారని ఆరోపించారు. నా హయాంలో ఎక్కడ కబ్జాలు జరగలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు సవాల్ విసిరిన కృష్ణారావు. ఇప్పుడు కాముని చెరువు కబ్జాలపై ఏమంటారు అని కాంతారావు ప్రశ్నించారు.