
హైదరాబాద్,వెలుగు: తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షుడిగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మధు యాష్కీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడు సతీశ్‌కుమార్, జనరల్ సెక్రటరీ రాఘవేంద్ర రాజు అల్లి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సమావేశంలో మధు యాష్కీని ఎన్నుకున్నట్టు యూనియన్ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా మధుయాష్కీ మాట్లాడుతూ తాను జలమండలి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ఉద్యోగులకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని తెలిపారు. జలమండలిలోని సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని మధుయాష్కీ ఆధ్వర్యంలో త్వరలో బోర్డు ఎండీని కలవనున్నట్టు ఎంప్లాయీస్ నేతలు తెలిపారు.