మెట్రోలో మధుయాష్కీ వినూత్న ప్రచారం

మెట్రోలో మధుయాష్కీ వినూత్న ప్రచారం

ఎన్నికలు దగ్గరపడుతుండడంతో రాజకీయనేతల ప్రచారం తారాస్థాయికి చేరింది. ప్రచారానికి వారం రోజులే  సమయం ఉండడంతో పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థులు...వినూత్న ప్రచారంతో దూసుకపోతున్నారు. 

రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ మెట్రో ప్రాంగణంలో క్యాంపెయినింగ్ చేశారు. ఎల్బీనగర్ నుంచి మెట్రోలో ప్రయాణిస్తూ..ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులతో మాట్లాడారు. తొమ్మిదేళ్లలో BRS సర్కార్ ప్రజాధనంను దుర్వినియోగం చేస్తూ  విధ్వంసం సృష్టిస్తుంచారని వివరించారు యాష్కీ. 

కోట్లాది రూపాయల అప్పులతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు... ప్రస్తుతం ప్రమాదంలో పడిందని విమర్శించారు. తెలంగాణ భవిష్యత్ కోసం కాంగ్రెస్ ను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు మధుయాష్కీ.