ఎమ్మెల్సీగా మధుసూదనాచారి

ఎమ్మెల్సీగా మధుసూదనాచారి

గతంలో అసెంబ్లీ స్పీకర్‎గా పనిచేసిన మధుసూదనాచారిని ఎమ్మెల్సీగా ఎన్నుకోనున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ఆయన పేరును రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‎కు పంపింది. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‎లో చేరిన పాడి కౌశిక్ రెడ్డిని మొదటగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ప్రతిపాదించారు. అయితే ఆ ఫైలు గవర్నర్ వద్ద పెండింగ్‎లో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చారు. మధుసూదనాచారికి మద్దతుగా మంత్రుల సంతకాలతో కూడిన ఫైలును రాష్ట్ర ప్రభుత్వం రాజ్ భవన్‎కు పంపించింది. ఆ ఫైలుపై గవర్నర్ ఆమోద ముద్ర వేశారు.