
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ వైపే చూస్తున్నారని, అందుకే వేరే పార్టీల నేతలు తమ పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ అన్నారు. ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్‌లోకి వస్తే.. సొంత పార్టీ నేతలకు టికెట్ల కేటాయింపులో అన్యాయం జరగకుండా చూడాల్సిన అవసరముందని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌లోకి వచ్చే వాళ్లందరినీ స్వాగతిస్తామని చెప్పారు. కాంగ్రెస్‌లో చేరే వాళ్ల విషయంలోనే ఎందుకు ఆంధ్రోళ్లు అంటూ కామెంట్ చేస్తున్నారని, కేసీఆర్ పార్టీలో ఆంధ్ర నాయకులు లేరా అని నిలదీశారు.
ఆంధ్ర ప్రాంత నాయకులతోనే కేసీఆర్ ప్రభుత్వాన్ని నడపడం లేదా అని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సమన్యాయం చేయాలన్నదే కాంగ్రెస్ సిద్ధాంతమని, కానీ తెలంగాణ, ఏపీ మధ్య సీఎం కేసీఆర్ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు.