రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్.. బోరుబావిలో పడిన ఐదేళ్ల చిన్నారి సురక్షితం

రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్.. బోరుబావిలో పడిన ఐదేళ్ల చిన్నారి సురక్షితం

మధ్యప్రదేశ్ లోని రాజ్‌గఢ్ జిల్లా పిప్లియా రసోదా గ్రామంలో బోరుబావిలో పడిన 5 ఏళ్ల చిన్నారిని ఈ రోజు(డిసెంబర్ 6) తెల్లవారుజామున ఎస్‌డిఆర్‌ఎఫ్, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు రక్షించాయి. డిసెంబర్ 5న సాయంత్రం పొలంలో తెరిచి ఉంచిన బోరుబావిలో చిన్నారి పడింది. బోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని పిప్లియా రసోడా గ్రామంలో ఈ ఘటన జరిగిందని పోలీసు సూపరింటెండెంట్ ధర్మరాజ్ మీనా తెలిపారు.

ఘటన అనంతరం సమాచాకం అందుకున్న స్టేట్ డిజాస్టర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డిఇఆర్‌ఎఫ్) సంఘటనా స్థలానికి చేరుకుని బోర్‌వెల్ షాఫ్ట్ లోపల చిన్నారికి ఆక్సిజన్ అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన అధికారిక X ఖాతా ద్వారా స్పందించారు. స్థానిక పరిపాలనాధికారులతో టచ్‌లో ఉన్నారని తెలిపారు.

“ఎస్‌డీఇఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్, జిల్లా యంత్రాంగం చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. నేను స్థానిక పరిపాలనతో నిరంతరం టచ్‌లో ఉన్నాను. చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి మేము ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టం” అని శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు.