శ్రీశైల మల్లన్న సేవలో మధ్యప్రదేశ్ సీఎం

శ్రీశైల మల్లన్న సేవలో మధ్యప్రదేశ్ సీఎం

శ్రీశైలం, వెలుగు : శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామిని శనివారం మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌ సీఎం మోహన్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ నుంచి హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌ ద్వారా సున్నిపెంట చేరుకున్న ఆయన, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం చేరుకున్నారు. ఆలయ రాజగోపురం వద్ద ఆయనకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకొని రుద్రాభిషేకం, కుంకుమార్చన నిర్వహించారు.

తర్వాత అర్చకులు, వేదపండితులు ఆయనకు వేదాశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు స్వామి వారి శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలంతా బాగుండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు.