కొత్తజీవో : పెళ్లి కోసం మతం మార్చుకుంటే 5ఏళ్ల జైలు శిక్ష

కొత్తజీవో : పెళ్లి కోసం మతం మార్చుకుంటే 5ఏళ్ల జైలు శిక్ష

లవ్ జీహాద్ (పెళ్లి కోసం మతం మార్చడం) ను  ప్రోత్సహించేలా కార్యకలాపాలు చేపడితే 5ఏళ్ల జైలు శిక్ష విధించేలా చట్టం అమల్లోకి రానుంది. మధ్యప్రదేశ్ హోం మినిస్టర్ నారోత్తమ్ మిశ్ర మాట్లాడుతూ లవ్ జీహాద్ కు పాల్పడితే నాన్  బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ తో పాటు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించేలా కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో మధ్యప్రదేశ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్ –2020 పేరుతో జీవోను పాస్ చేయబోతున్నట్లు తెలిపారు. జీవో జారీ అనంతరం లవ్ జీహాద్ కు పాల్పడిన జంటతో పాటు అందుకు ప్రేరేపించిన ప్రతీ ఒక్కరిని శిక్షించేలా ఈ జీవోలో మార్పులు చేస్తామన్నారు.

ఎవరైనా స్వచ్ఛందంగా మతాన్ని మార్చుకోవాలనుకునే వారు కలెక్టర్ కార్యాలయంలో అప్లయ్ చేసుకోవలన్నారు. వాస్తవ పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకొని కలెక్టర్ కార్యాలయం అధికారులు ప్రొసిడింగ్స్ ప్రారంభిస్తారని  మధ్యప్రదేశ్ హోం మినిస్టర్ నారోత్తమ్ మిశ్ర స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే లవ్ జీహాద్ కు పాల్పడే వారికి,అందుకు ప్రోత్సహించే వారిని కఠినంగా శిక్షించేందుకు మధ్య ప్రదేశ్ తో పాటు కర్ణాటక, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాలు  కొత్త చట్టాల్ని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.