- డిప్యూటీ కలెక్టర్ల ప్రతినిధి ఆదిత్య నారాయణ తివారీ
హైదరాబాద్ సిటీ, వెలుగు: తెలంగాణలో ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తమ రాష్ట్రంలోనూ అమలుచేస్తామని మధ్యప్రదేశ్ డిప్యూటీ కలెక్టర్ల ప్రతినిధి ఆదిత్య నారాయణ తివారీ అన్నారు. శుక్రవారం మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో నిర్వహించిన సీఎం ప్రజావాణిని మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 24 మంది డిప్యూటీ కలెక్టర్ల బృందం సందర్శించింది.
ఈ సందర్బంగా సీఎం ప్రజావాణి ఇన్చార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ తో వారు భేటీ అయ్యారు. సీఎం ప్రజావాణి అమలు, ప్రజల సమస్యల పరిష్కారానికి అనుసరిస్తున్న తీరును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వీక్షించారు. తమ రాష్ట్రంలోనూ ఈ తరహా పద్ధతిని అమలు చేస్తామని డిప్యూటీ కలెక్టర్లు చెప్పారు.
