బోధన్,వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈనెల13న నిర్వహించిన కామారెడ్డి,- నిజామాబాద్ జిల్లాల చెస్ పోటీల్లో బోధన్ లోని గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఉత్తమ ప్రతిభను చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు గురుకుల పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఎన్. రాజేంద్రప్రసాద్ శుక్రవారం తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యోగా కేంద్రంలో అండర్-14, అండర్-17 బాలబాలికల విభాగాల్లో ఈ పోటీలను నిర్వహించగా, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన చెస్ క్రీడాకారులు పాల్గొన్నారు.
అండర్-17 బాలుర విభాగంలో జంగం రవివర్మ మొదటి స్థానంలో నిలువగా, అండర్-14 విభాగంలో ఎంబీ.శివకుమార్ తృతీయ స్థానంలో నిలిచారని తెలిపారు. త్వరలో జరిగే రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో వీరు నిజామాబాద్,- కామారెడ్డి జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారని ప్రిన్సిపాల్ తెలిపారు.
