టెక్నికల్ విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి : సుదర్శన్రెడ్డి

టెక్నికల్ విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి  : సుదర్శన్రెడ్డి
  • ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్​రెడ్డి 

నిజామాబాద్​, వెలుగు: గత బీఆర్​ఎస్​ పాలనలో నిర్లక్ష్యానికి గురైన విద్యారంగాన్ని సీఎం రేవంత్​రెడ్డి సర్కార్​ సరిదిద్దుతోందని ప్రభుత్వ సలహాదారుడు పి.సుదర్శన్​రెడ్డి అన్నారు.  శుక్రవారం నగరంలోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో కొత్తగా నిర్మించిన హాస్టల్​ బిల్డింగ్​ను ప్రారంభించి మాట్లాడారు.  దేశ భవిష్యత్​ నిర్మాణంలో  యూత్​ భాగస్వామ్యులు కావాలని సూచించారు. షబ్బీర్​అలీ మాట్లాడుతూ ఆధునీక సాంకేతిక విద్య అందుబాటులోకి తేవడానికి కాంగ్రెస్​ ప్రభుత్వం 66 అడ్వాన్స్​డ్​ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేసిందన్నారు. వాటిలో చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు దక్కేలా కార్పొరేట్​ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. 

ఎడ్యుకేషన్ హబ్​ చేస్తం.. టీపీసీసీ ప్రెసిడెంట్​ మహేష్​గౌడ్​

ఇందూర్​ జిల్లాను ఎడ్యుకేషన్​ హబ్​గా మార్చుతామని టీపీసీసీ ప్రెసిడెంట్​, ఎమ్మెల్సీ మహేశ్​​కుమార్​ గౌడ్​ అన్నారు. ఇందులో భాగంగా ఇంజినీరింగ్​ కాలేజీ మంజూరు చేశామని, ఇప్పుడు తెలంగాణ వర్సిటీలో అగ్రికల్చర్​ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. హాస్టల్​ బిల్డింగ్​ నిర్మాణానికి రూ.కోటి 6 లక్షల విరాళమిచ్చిన పాలిటెక్నిక్​ కాలేజీ పూర్వ విద్యార్థి ప్రతాప్​రెడ్డి, కార్పొరేట్​ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రూ.2.86 కోట్ల నిధులిచ్చిన బీహెచ్​ఈఎల్​ సంస్థకు చెందిన అసిస్టెంట్​ జీఎం సెల్వంను సన్మానించారు. 

కలెక్టర్​ వినయ్​కృష్ణారెడ్డి,  రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ, కార్పొరేషన్​ చైర్మన్ లు మానాల మోహన్​రెడ్డి, తాహెర్​, డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్​రెడ్డి, గ్రంథాలయ చైర్మన్​ అంతిరెడ్డి రాజిరెడ్డి, కాలేజీ ప్రిన్సిపాల్​ భారతి పాల్గొన్నారు. 

బోధన్​లో సుదర్శన్​రెడ్డి ఘన స్వాగతం..  

బోధన్ : ప్రభుత్వ సలహదారుడు సుదర్శన్​రెడ్డికి కాంగ్రెస్​శ్రేణులు బోధన్​ పట్టణంలోని ఆచన్​పల్లి కమాన్​ వద్ద జేసీబీతో పెద్ద గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం బైక్​ ర్యాలీ  నిర్వహించారు. టీటీడీ కల్యాణ మండపంలో సుదర్శన్​రెడ్డిని సన్మానించారు.  ఎమ్మెల్యే పి.సుదర్శన్​ రెడ్డి మాట్లడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని చూసి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు ఘన విజయం కట్టబెట్టారన్నారు.  రాబోవు కౌన్సిలర్లు, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు.  బోధన్ మున్సిపాలిటికి రూ.18కోట్లు వచ్చాయని తెలిపారు. ఉర్దు అకాడమిక్​ చైర్మన్​ తాహెర్, జిల్లా గ్రంథాలయ జిల్లా చైర్మన్​ అంజిరెడ్డి రాజరెడ్డి, డీసీసీబీ చైర్మెన్​ రమేశ్​రెడ్డి, కాంగ్రెస్ బోధన్ పట్టణ అధ్యక్షుడు పాషామోయినొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.