పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న ఖైదీ..అనంతపురం జిల్లా జైలు నుంచి తీసుకొచ్చిన కల్వకుర్తి పోలీసులు

 పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న ఖైదీ..అనంతపురం జిల్లా జైలు నుంచి తీసుకొచ్చిన కల్వకుర్తి పోలీసులు

కల్వకుర్తి, వెలుగు: నాగర్​కర్నూల్​ జిల్లా కల్వకుర్తి పోలీసుల కస్టడీ నుంచి ఖైదీ తప్పించుకున్నాడు. విశ్వసనీయ  సమాచారం మేరకు.. నంద్యాల జిల్లాకు చెందిన నాగిరెడ్డి 50 కేసుల్లో నిందితుడు కాగా, ప్రస్తుతం ఏపీలోని అనంతపురం జిల్లా జైల్లో ఉన్నాడు. కల్వకుర్తి పోలీస్ స్టేషన్  పరిధిలో పలు కేసులు ఉండగా, నాగిరెడ్డిని విచారించేందుకు పీటీ వారెంట్ పై ఈ నెల 11న కల్వకుర్తి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. అయితే గురువారం రాత్రి వాష్ రూమ్ కు వెళ్లొస్తానని చెప్పగా పంపించారు. వాష్ రూమ్ లో ఉన్న వెంటిలేటర్  మనిషి దూరేంతగా ఉండడంతో అందులో నుంచి దూకి పరారయ్యాడు. ఆ సమయంలో అతడికి కాపలాగా ముగ్గురు పోలీసులు ఉన్నారు. పరారైన ఖైదీ కోసం కల్వకుర్తి పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.