గవర్నమెంట్ స్కూల్లో చదివితే 5% రిజర్వేషన్.. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

 గవర్నమెంట్ స్కూల్లో చదివితే  5% రిజర్వేషన్..  మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న  విద్యార్థులకు వైద్య కళాశాలల్లో ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లుగా ప్రకటించింది.  నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించలేకపోతున్నారని సీఎం అన్నారు.  

దీంతో దేశంలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు వైద్య విద్య కోసం ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  ఈ సీట్లలో ప్రవేశానికి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మాత్రమే అర్హులు అని సీఎం వెల్లడించారు.   1857 తిరుగుబాటులో గిరిజన దిగ్గజాలైన రాజు శంకర్‌షా మరియు అతని కుమారుడు కున్వర్ రఘునాథ్ షాల అమరవీరుల స్మారకార్థం జబల్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో చౌహాన్ ఈ ప్రకటన చేశారు.