-
మాదిగ దండోరా ఆధ్వర్యంలో... సీఎంకు సాష్టాంగ నమస్కారం
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ చేసి తమ వాటా ఉద్యోగాలను తమకు కేటాయించాలని కోరుతూ తెలంగాణ మాదిగ దండోరా నాయకులు శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి ఇంటి ముందు సాష్టాంగ నమస్కారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెరువులు, కుంటలను ఎఫ్టీఎల్, బఫర్ జోన్ భూములను కాపాడేందుకు హైడ్రా ను ఏర్పాటు చేసినట్లే మాదిగలకు రావాల్సిన ఉద్యోగాలను కబ్జా చేస్తున్న వారి నుంచి కాపాడాలని కోరారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పు ఇచ్చాక న్యాయపరమైన చిక్కులు ఎలా వస్తాయని, అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు.