- మంత్రి అడ్లూరిని కోరిన మాదిగ ఎంప్లాయీస్ జాగృతి
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్లలో ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను మాదిగ ఎంప్లాయీస్ జాగృతి నాయకులు కోరారు. గురువారం సెక్రటేరియెట్ లో విశారదన్ మహారాజ్ ఆధ్వర్యంలో పలువురు నేతలు మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. పోలీస్, విద్యుత్, విద్య, రవాణా తదితర శాఖల్లో చేపట్టే ప్రమోషన్ల ప్రక్రియలో ఎస్సీ వర్గీకరణ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ చట్టం విద్య, ఉద్యోగ నియామకాలకే పరిమితం కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్లలోనూ సమర్థవంతంగా అమలయ్యేలా ప్రభుత్వం పర్యవేక్షించాలన్నారు.
