మాదిగలకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి

మాదిగలకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి
  • మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ జేఏసీ

బషీర్ బాగ్, వెలుగు: కొత్తగా ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవి మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలని మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ జేఏసీ నేతలు కొక్కెర భూమన్న మాదిగ, ఇటుక రాజు మాదిగ , కనకరాజు మాదిగ డిమాండ్ చేశారు. జేఏసీ నేతలు మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్​లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... 30 ఏళ్లుగా ఎస్సీ వర్గకరణకు పోరాడుతున్న మాదిగ సామాజికవర్గం కోసం.. కాంగ్రెస్ తొలి అసెంబ్లీ సమావేశంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరారు.  

దళిత బంధు పేరు మార్పు చేసి, రూ. 10 లక్షల నుంచి 12 లక్షలకు పెంచి అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. చేవెళ్లలో ఇచ్చిన కాంగ్రెస్ దళిత డిక్లరేషన్ అమలు చేయాలని పేర్కొన్నారు.  మాదిగ ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు.