పదేండ్లు ప్రజల ధనాన్ని దోచుకుండ్రు : మాదిరెడ్డి జలందర్​ రెడ్డి

పదేండ్లు ప్రజల ధనాన్ని దోచుకుండ్రు : మాదిరెడ్డి జలందర్​ రెడ్డి

మక్తల్, వెలుగు : బీఆర్ఎస్​ పార్టీ పదేండ్లుగా ప్రజల ధనాన్ని దోచుకుందని మక్తల్​ బీజేపీ అభ్యర్థి మాదిరెడి జలందర్ రెడ్డి  ఆరోపించారు.  గురువారం  అమరచింత మండలం చిన్నకడుమూరులో, మక్తల్ మండలంలో ఆయన సతీమణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జలందర్​రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్​ ప్రభుత్వాన్ని ఈ ఎన్నికల్లో గద్దె దింపాలని పిలుపునిచ్చారు.

నియోజకవర్గంలో పదేళ్లుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదని,  ఎమ్మెల్యే కోట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు.  కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే  రాష్ట్రంలో అన్ని కుంభకోణాలే ఉంటాయని విమర్శించారు. బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి అంశాన్ని అమలు చేస్తామన్నారు.  

కాగా చిన్నకడ్మూర్​లో ఓ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను జలంధర్​రెడ్డి  ఆశీర్వదించారు. కార్యక్రమంలో  కొండయ్య, కర్నే స్వామి,  బలరాం రెడ్డి, భాస్కర్, నర్సింహారెడ్డి, రాజశేఖర్​ రెడ్డి, సోమశేఖర్ గౌడ్​, భరత్​ తదతరులు పాల్గొన్నారు.