
చెన్నై: చైనాకు చెందిన షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్‌పై విధించిన నిషేధాన్ని మద్రాస్ హైకోర్టు ఎత్తివేసింది. ఈ యాప్ యువతను పెడదోవ పట్టిస్తుందనే కారణంతో.. యాప్ డౌన్‌లోడ్‌పై నిషేధం విధించాలని ఆదేశిస్తూ ఈ నెల 3వ తేదీన కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ ఎన్ కురుబకరన్, జస్టిస్ ఎస్ ఎస్ సుందర్‌లతో కూడిన మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే దీనిపై టిక్‌టాక్ యాప్ యాజమాన్యం.. బుధవారం కోర్టులో తమ తరపు న్యాయవాది చేత వాదనలు తెలిపింది. యాప్ ను నిషేధించడం భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడమేనని ఆ యాప్ తరపు న్యాయవాది అన్నారు. ఒకవేళ యువత పెడదోవ పట్టడమే కారణమైతే అందుకు పరిష్కారం అప్లికేషన్ ను నిషేధించడం కాదని అన్నారు. పోర్నోగ్రఫీ వంటి వీడియోలను అప్‌లోడ్ చేయకూడదు అనే కొన్ని పరిమితులు విధిస్తూ బుధవారం ఆ నిషేధాన్ని ఎత్తివేసింది మద్రాస్ హైకోర్టు.
తాజా తీర్పుతో త్వరలో ఇక ఇంతకుముందు లాగే గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్‌లో టిక్‌టాక్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.