తల్లిని చూసుకోని కుమార్తెకు ఆస్తి హక్కులుండవ్..

తల్లిని చూసుకోని కుమార్తెకు ఆస్తి హక్కులుండవ్..
  • మద్రాస్​ హైకోర్టు సంచలన తీర్పు

కన్న తల్లి పోషణను విస్మరిస్తే ఆమెకు చెందిన ఆస్తిపై హక్కులు ఉండవని మద్రాస్​ హైకోర్టు స్పష్టం చేసింది. ఓ పిటిషన్​ విచారణ సందర్భంగా రెవెన్యూ ఆఫీసర్​ ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు సమర్థిస్తూ  ఈ తీర్పు వెలువరించింది. 

తిరుప్పూర్​ జిల్లా మలైపేట్​కు చెందిన రాజమ్మాళ్ తన మూడెకరాల భూమిని కుమార్తె సుగుణ పేరుతో 2016లో  రిజిస్ట్రేషన్​ చేయించింది. అంతకు ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం.. తల్లి పోషణను కుమార్తె చూసుకోవాలి. 

కానీ, ఆమె పట్టించుకోవడం లేదని, ఆస్తి రిజిస్ర్టేషన్​ రద్దు చేయాలని రాజమ్మాళ్​ ఉడుమలైపేట్​ రెవెన్యూ ఆఫీసర్​కి ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన అనంతరం రిజిస్ర్టేషన్​ ని రద్దు చేయాలని ఆఫీసర్​ ఉత్తర్వులు ఇచ్చారు. 

ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ సుగుణ మద్రాస్​ హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. న్యాయమూర్తి విచారించి రెవెన్యూ ఆఫీసర్​ నిర్ణయాన్ని సమర్థించారు. తల్లిని పట్టించుకోని కుమార్తెకు ఆస్తిపై ఎలాంటి హక్కులుండవని స్పష్టం చేశారు.